LOADING...
PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్
UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్

PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్‌తో కలిసి చెకర్స్‌లో విరామ సమయంలో మోదీ చాయ్‌ను ఆస్వాదించారు. ఆ టీని భారతీయ మూలాలు కలిగిన యువ పారిశ్రామికవేత్త అఖిల్ పటేల్ స్వయంగా తయారుచేశాడు. మోదీ ఈ దృశ్యాల్ని తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంటూ, ''చెకర్స్‌లో కీవ్ స్టార్మర్‌తో కలిసి చాయ్ పే చర్చా.. భారత్-యూకే సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి'' అనే క్యాప్షన్ జతచేశారు. అయితే ప్రధానితో ముచ్చటిస్తున్న ఆ కుర్రాడు ఎవరా..? అని అందరూ ఆన్‌లైన్‌లో చర్చించుకొంటున్నారు.

వివరాలు 

హాంప్‌స్టెడ్‌లో యూనివర్శిటీ కాలేజీ నుంచి పట్టా

ఈ పర్యటన సమయంలో చెకర్స్‌లోని బ్రిటిష్ ప్రధానమంత్రి అధికార నివాసంలో ఓ చిన్న చాయ్ స్టాల్ ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ, స్టార్మర్ కలిసి చాయ్ తాగారు.దానిని అఖిల్‌ పటేల్‌ అనే భారతీయ మూలాలు ఉన్న కుర్రాడు ఏర్పాటు చేశాడు. ప్రధాని మోదీకి కప్పులో టీ ఒంపుతూ..'ఒక చాయ్‌ వాలా మరో చాయ్‌వాలాకు' అని వ్యాఖ్యానించాడు. ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థి నుంచి టీ వ్యాపారవేత్తగా మారాడు. అఖిల్ పటేల్‌ విద్యలో అత్యుత్తమంగా నిలిచినవాడు. అతని లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్ ప్రకారం,హాంప్‌స్టెడ్ యూనివర్శిటీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ నుంచి బీఎస్సీ, మేనేజ్‌మెంట్ లో పట్టాలు పొందాడు.

వివరాలు 

లద్దాఖ్‌ ట్రిప్‌ మార్చేసింది.. 

విద్య తర్వాత, అతను పలు ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేశాడు. చివరకు డేటా అనలిస్ట్‌గా ఉద్యోగంలోకి అడుగుపెట్టాడు. అఖిల్ పటేల్ జీవితంలో మలుపు తిప్పిన ఘట్టం 2018లో చోటు చేసుకుంది. అదే లద్దాఖ్‌ ట్రిప్‌. టీ తాగడం అతనికి చిన్నప్పటినుంచే అలవాటు ఉన్నా, లద్దాఖ్‌లో మాత్రం టీ పానాన్ని ఒక సంప్రదాయం, ఒక శ్రద్ధగా చూసే తీరును గమనించాడు. అది అతనికి గొప్ప ప్రేరణగా మారింది. ఆ స్ఫూర్తితో 2019లో 'అమలా' అనే పేరుతో టీ బ్రాండ్‌ను ప్రారంభించాడు.

వివరాలు 

అమ్మమ్మ నుండి స్పూర్తి - రైతులతో నేరుగా ఒప్పందాలు 

అఖిల్‌ తన అమ్మమ్మ నుంచి టీ తయారీ పట్ల ప్రేరణ పొందినట్టు చెబుతున్నాడు. 'అమలా' బ్రాండ్ కోసం ఉపయోగించే టీ ఆకులు, ఇతర సుగంధ పదార్థాల కోసం అస్సాం, కేరళ ప్రాంతాల్లోని రైతులను వ్యక్తిగతంగా కలిశాడు. మధ్యవర్తులను తొలగించి, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో రైతులకు నష్టాలు కాకుండా, మంచి లాభాలు లభించాయి. అంతేకాదు, సేంద్రియ (ఆర్గానిక్) ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని బ్రిటిష్ మ్యూజియం రూపొందించిన వీడియోలో కూడా ప్రస్తావించారు. 2024 మేలో అఖిల్‌ తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోను బ్రిటిష్‌ మ్యూజియం ఇన్‌స్టాగ్రామ్ కవర్‌గా ఉపయోగించింది. ఇది అతని సఫలతకథను గుర్తించిన మహత్తర ఘట్టంగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్