Page Loader
KCR: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..

KCR: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకత్వానికి సూచించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ సమావేశ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు సాగిన దీర్ఘ ప్రస్థానం గురించి కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు.

వివరాలు 

తెలంగాణను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:  కేసీఆర్‌ 

''తెలంగాణ ప్రజల కష్టాలను నిజంగా అర్థం చేసుకునే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ కోసం నిజమైన పోరాటం చేయగలిగేది బీఆర్ఎస్ ఒక్కటే. మేము వందశాతం తిరిగి అధికారంలోకి వస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనుకబడి పోతోంది. పాతికేళ్ల ఉద్యమ స్ఫూర్తితో మరోసారి తెలంగాణను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'' అని కేసీఆర్‌ అన్నారు.