Page Loader
Meta: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా 
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా

Meta: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలలో, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీయగా, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో,మెటా సంస్థ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది.జుకర్‌బర్గ్‌ చేసిన అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు అడిగింది. జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ,కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ చేసిన పోస్ట్‌కు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్‌రాల్‌ స్పందించారు. ఆయన"2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాధించలేదనే వాదన చాలా దేశాల్లో నిజమే అయినప్పటికీ,భారత్‌లో మాత్రం కాదు.అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలుపుతున్నాం.మెటా భారతదేశం కీలక భాగస్వామి,ఈ దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించేందుకు మేము ఎదురుచూస్తున్నాము"అని పేర్కొన్నారు.

వివరాలు 

అసలు ఈ వివాదం ఎలా మొదలయ్యిందంటే..

జనవరి 10న జుకర్‌బర్గ్ ఓ పాడ్‌కాస్ట్‌లో 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నికల గురించి మాట్లాడారు. "2024 అనేది అతిపెద్ద ఎన్నికల ఏడాది అయింది. భారత్‌ సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రతి చోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. ద్రవ్యోల్బణం లేదా కొవిడ్‌ను ఎదుర్కొనే ఆర్థిక విధానాలు దీనికి కారణం కావొచ్చు" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాన్ని రేపగా,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ వాదనను తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

64 కోట్ల మంది ఓటర్లు

"భారత్‌లో 2024లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లో ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి విజయానికి COVID-19 తర్వాత ఇచ్చిన నిర్ణయాలు, 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 220 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ మరియు ప్రపంచదేశాలకు సాయం ఇచ్చే తీరు నిదర్శనాలు" అని తెలిపారు. స్వయంగా జుకర్‌బర్గ్‌ నుంచి ఇలాంటి అసత్య సమాచారాన్ని పొందడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకోవాలని కేంద్రమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా, మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది.