
Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏప్రిల్ 22, మంగళవారం నాడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన పడే సూచనలు ఉన్నాయి.
Details
భద్రాచలంలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అంతేకాకుండా, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగుతోంది. ఈ రోజు గరిష్ఠంగా ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా భద్రాచలంలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రతలు జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి:
ఆదిలాబాద్ : 43.5°C - నిజామాబాద్ : 43.1°C - మెదక్ : 41.8°C - రామగుండం : 41.4°C
ఖమ్మం : 40.4°C - మహబూబ్ నగర్, హనుమకొండ, నల్లగొండ : 40°C - భద్రాచలం : 39.4°C - హైదరాబాద్ : 38.8°C
Details
రాబోయే మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.
ఇవన్నీ 41°C నుంచి 45°C మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముంది.
Details
ఏపీలో వడగాడ్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం రోజుల్లో వడగాడ్పులు ఎక్కువగా నమోదవుతాయని విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరించింది.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 21 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు నమోదవుతాయని సూచించారు.
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Details
ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే
తిరుపతి రూరల్ : 42.1°C - అన్నమయ్య జిల్లా కంబాలకుంట 41.5°C - నెల్లూరు జిల్లా దగదర్తి : 41.4°C
ఏలూరు జిల్లా దెందలూరు : 41.3°C - నంద్యాల జిల్లా గోనవరం, పల్నాడు జిల్లా రావిపాడు: 41.1°C
ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.