తదుపరి వార్తా కథనం

IPL-Uppal-Metro Trains: ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్...మెట్రోరైళ్ల సమయం పొడిగింపు
వ్రాసిన వారు
Stalin
Apr 24, 2024
12:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
గురువారం హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ (Uppal) మైదానంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్ మెట్రో (Metro Rail)శుభవార్త అందించింది.
మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సర్వీసు ల సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్ జిఆర్ ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు రాత్రి 12 :15 గంటలకు బయలుదేరి రాత్రి 1:10 గంటలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7:30 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు -సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సర్వీసు సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు.