Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా మద్యం సరఫరా విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, నాణ్యమైన మద్యం అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే అందించే నూతన పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో రూ. 120కి అమ్మిన మద్యం ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం రూ. 99కి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా నిత్యం మద్యం వినియోగించే వర్గాలకు బడ్జెట్ తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదనంగా, గీత కార్మికులకు మద్యం దుకాణాల 10% కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మద్యం దుకాణాల నిర్వహణలో గీత కార్మికులు భాగస్వామ్యం పొందే అవకాశం ఉంది.
వాలంటీర్ల ఆర్థిక సాయం నిలిపివేత
ప్రైవేట్ మద్యం దుకాణాలకు 2 సంవత్సరాల కాలపరిమితితో రూ. 2 లక్షలు అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంటుంది. లైసెన్స్ ఫీజులు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఏపీలో 12 ప్రీమియర్ మద్యం దుకాణాలకు 5 సంవత్సరాల అనుమతితో రూ. 15 లక్షల నాన్ రిఫండ్ ఫీజు, రూ. 1 కోటి లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. మునుపటి ప్రభుత్వం వాలంటీర్లకు ప్రతి నెల రూ. 200 ఆర్థిక సాయం అందించేది. ఈ సాయాన్ని వారు వార్త పత్రికలు కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు
మంత్రి పార్ధసారథి వెల్లడించిన వివరాల ప్రకారం,గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం కింద వాలంటీర్లు ఒకే పత్రికను కొనుగోలు చేస్తూ,ఈ కారణంగా రూ. 102 కోట్ల మేర ఖర్చు జరిగింది. వాలంటీర్ల కాలపరిమితి గత ఏడాది ఆగస్టులో ముగియడంతో ఈ ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భోగాపురం ఎయిర్‌పోర్టును "అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్"గా నామకరణం చేయనున్నారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యత
ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్ధసారథి చెప్పారు. ప్రజల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవడానికి కేబినెట్ "ఎలివేషన్ వయో కార్డియల్ - స్టెమీ" కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రాణాంతక జబ్బులను గుర్తించడానికి పరీక్షలు చేయడం సులభం అవుతుంది. స్కూల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి వారికి అపార్ ఐడీ కార్డులు అందించనున్నారు. ఈ ఐడీ కార్డుల ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమాచారం అనుసంధానంగా ఉంటుంది.
ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ
ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)ల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ పథకం క్రింద 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో "క్రెడిట్ గ్యారెంటీ స్కీం" అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పథకాల అనుసంధానంతో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పోరేషన్ మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.ఈ కార్పోరేషన్‌కు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు. ఇప్పటి వరకు దేశంలోని కేవలం 6రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధమైన కార్పోరేషన్‌లు ఉన్నాయి. ఈ నిర్ణయం మాజీ సైనికోద్యోగుల కోసం సురక్షితమైన భవిష్యత్తును సృష్టించడానికి కీలకమని మంత్రి అన్నారు.
ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్శిటీ
తమ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీని డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న డీమ్డ్ యూనివర్శిటీల సంఖ్య పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో 26 డీమ్డ్ యూనివర్శిటీలున్నప్పటికీ, ఏపీలో కేవలం 5 మాత్రమే ఉన్నాయన్నారు. ఏపీ విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి బిట్స్ పిలానీ వంటి ప్రముఖ విద్యాసంస్థలను ఏపీకి రప్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
బీసీలకు 33% రిజర్వేషన్లు
బీసీ వర్గాలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కేబినెట్ తీర్మానం చేసింది. కౌలు రైతుల సంక్షేమం కోసం కౌలు కార్డుల ప్రోఫార్మా మార్పులను కూడా కేబినెట్ ఆమోదించింది. పాత విధానాల వల్ల రైతులకు కౌలు కార్డులు అందకపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త మార్గదర్శకాల ప్రకారం కౌలు రైతులకు మరింత సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.