
Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.
అక్టోబర్ 29, 2023న ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఉదంతాన్ని ఉదహారణగా పేర్కొన్నారు.
రైళ్లు ఢీకొన్న సమయంలో రైలు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ మొబైల్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద హౌరా-చెన్నై మార్గంలో విశాఖపట్నం- పలాస రైలును రాయగడ ప్యాసింజర్ రైలు వెనుక నుండి ఢీకొట్టిందని ఆయన చెప్పారు.
ఏపీ
ఇద్దరు డ్రైవర్లు పరధ్యానంలో.. : మంత్రి
క్రికెట్ మ్యాచ్ కారణంగా లోకో పైలట్, కో-పైలట్ ఇద్దరూ పరధ్యానంలో ఉండటంతో నాడు రైలు ప్రమాదం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆ ప్రమాదంలో 14 మంది మరణించారని, 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని ఆయన వివరించారు.
తాము ఇప్పుడు అలాంటి పరధ్యానాలను గుర్తించగల వ్యవస్థలను ఇన్‌స్టాల్ చేస్తున్నామన్నారు. పైలట్, కో-పైలట్ పూర్తిగా రైలును నడపడంపై దృష్టి సారించేలా చేస్తున్నట్లు వెల్లడించారు.
తాము రైల్వే భద్రతపై దృష్టి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రతి సంఘటనకు మూలకారణాన్ని కనుగొని, అది పునరావృతం కాకుండా పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తామన్నారు.