NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్‌
    తదుపరి వార్తా కథనం
    MLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్‌
    నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్‌

    MLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

    కూటమి పార్టీల సమాఖ్యలో భాగంగా జనసేన అభ్యర్థిగా ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్‌ వేయనున్నారు.

    జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఆదేశాల మేరకు, నామినేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది.

    కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతుగా జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం తమ సంతకాలు చేశారు.

    ఈ ప్రక్రియకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా బాధ్యత తీసుకున్నారు.

    వివరాలు 

    ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లకు మార్చి 10 చివరి తేది

    ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేష్‌ బాబు, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్‌ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేశారు. అలాగే, మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా స్వయంగా సంతకం చేశారు.

    ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లకు మార్చి 10 చివరి తేది.

    ప్రభుత్వ సెలవులు మినహాయించి, మిగిలిన ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య శాసనసభ భవనంలో నామినేషన్‌లను స్వీకరించనున్నారు.

    మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది, అలాగే మార్చి 13న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జనసేన

    తాజా

    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం
    Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం శ్రీనగర్

    జనసేన

    Pawan Kalyan: రాజోలు, రాజానగరం నుండి జనసేన పోటీ  భారతదేశం
    Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన  పవన్ కళ్యాణ్
    Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్  పవన్ కళ్యాణ్
    TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025