
మరోసారి వివాదాస్పదమైన తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజయ్య వ్యాఖ్యలపై స్పందించిన కడియం, ఆయనలో మార్పు వస్తుందని ఆశించానని, కానీ ఏ మార్పూ లేదని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ కుటుంబ వ్యవస్థనే రాజయ్య అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముక్కు నేలకు రాయాలని కడియం పట్టుబట్టారు.
డాక్టర్ చదివి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. అంతకుముందు కడియం శ్రీహరి ఎస్సీ కాదని, ఆయన పద్మశాలి అని హిమ్మత్ నగర్ కార్యక్రమంలో భాగంగా రాజయ్య అన్నారు.
DETAILS
నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్సీ : కడియం శ్రీహరి
పిల్లల విషయంలో తల్లి సత్యమని, తండ్రి అపోహ అంటూ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం బ్లాక్ మెయిలర్ అని, చంద్రబాబు వెన్నుపోటు అంశంలో కీలక పాత్రధారి అని అన్నారు.
రాజయ్య వ్యాఖ్యలపై మాట్లాడిన కడియం, తన తల్లి బీసీ అని, తండ్రి ఎస్సీ అని వివరణ ఇచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాను ఎస్సీ అవుతానన్నారు. తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని తీర్పులో రాసి ఉందన్నారు.
తన తర్వాత తన బిడ్డ కూడా ఎస్సీనే అవుతుందన్నారు. ఒకవేళ తన బిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే, తన బిడ్డకు పుట్టే పిల్లలకు ఆ తండ్రి కులం వర్తిస్తుందన్నారు.
ఈ మాత్రం న్యాయం రాజయ్యకు తెలియదా అని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.