MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశే ఎదురైంది. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి(ఆగష్టు 7) తుది వాదనలు వింటామని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. సీనియర్ అడ్వకేట్స్ అందుబాటులో లేనందున కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరుపు న్యాయవాది కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడా నిరాశే ఎదురవడంతో తిరిగి ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.