
MLC KAVITHA: ఫిక్సయిన కవిత కొత్త పార్టీ పేరు .. ప్రకటన ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బీసీ అజెండాను ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్లే కవిత, తన పార్టీ పేరులోనూ తన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె "తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి" (Telangana Bahujana Rashtra Samiti) అనే పేరును ఫిక్స్ చేశారు. ఇంకా, టీఆర్ఎస్ (TRS) పేరును కూడా పరిశీలనలో ఉంచారనే సమాచారం ఉంది. ప్రజల్లో ఇప్పటికే గుర్తింపు ఉన్న ఈ పేరును వాడితే కొత్త పార్టీకి ఆదరణ సులభంగా లభిస్తుందనే భావన కనిపిస్తోంది.
వివరాలు
త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించనున్న కవిత
మరోవైపు, కొద్దిసేపటి క్రిందే బీఆర్‌ఎస్ (BRS) నుండి కవితను సస్పెండెడ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఆమె త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించనున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత అసిస్టెంట్‌ను బీఆర్‌ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి తొలగించారు. ఇక కవిత పార్టీ పేరును ప్రకటించి, దీపావళికి అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అదే జరిగితే తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.