
MLC Kavitha: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత
ఈ వార్తాకథనం ఏంటి
''మా నాయకుడు కేసీఆర్‌గారే. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమవుతుంది'' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అమెరికా పర్యటనను ముగించుకొని హైదరాబాదుకు చేరుకున్న కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో జాగృతి కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
వివరాలు
నేను పార్టీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలు,కుటిల యత్నాల గురించి తెలిపాను
''వరంగల్ సభ అనంతరం రెండు వారాల క్రితం నా తండ్రి అయిన కేసీఆర్‌గారికి, నేను ఒక లేఖ రాశాను. ఆ లేఖ ద్వారా నా భావాలను,అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించాను. కానీ ఆ లేఖ అంతర్గతంగా మాత్రమే ఉంచాల్సింది. అది బయటకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దీనికి వెనుక ఎవరు ఉన్నారనే విషయం కూడా తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక ముగించుకొని అమెరికా నుంచి తిరిగొచ్చేలోపు ఆ లేఖ బయటికి వచ్చిందని తెలిసింది. దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని విన్నాను. ఇప్పటికే నేను పార్టీ అంతర్గతంగా జరుగుతున్న కుట్రలు,కుటిల యత్నాల గురించి తెలిపాను.
వివరాలు
గతంలో కూడా నేను నా తండ్రికి అంతర్గత లేఖలు రాసాను
నేను రాసిన ఆ లేఖ బయటపడటం పార్టీ సభ్యులందరూ ఆలోచించాల్సిన అంశం.ఆ లేఖలో నేను ప్రస్తావించిన విషయాలు.. పార్టీలోని చాలా మంది నేతల మనస్సులో ఉన్నవే. ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో కూడా నేను నా తండ్రికి అంతర్గత లేఖలు రాసాను" అని కవిత స్పష్టం చేశారు.
"కేసీఆర్‌గారు నాకు దేవుడు లాంటి వారు. కానీ ఆయన చుట్టూ కొంతమంది దుష్టశక్తులు.. దెయ్యాలు ఉన్నాయి. మాకు కేసీఆర్‌గారే నాయకుడు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం మంచి మార్గంలో సాగుతుంది. అలాగే భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ఆయన నేతృత్వంలో ముందుకు సాగుతుంది.
వివరాలు
కోవర్ట్‌గా పని చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారు
అయితే పార్టీలోని కొన్ని చిన్న చిన్న లోపాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్గతంగా ఆ లోపాలను సరిచేసుకోవాలి. కోవర్ట్‌గా పని చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నవారిని పక్కకు నెట్టి వేస్తే, పార్టీ మరింత బలోపేతం అవుతుంది'' అని ఆమె పేర్కొన్నారు.