
Rain Alert: రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు .. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు: ఐఎండీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ,ఎన్నో ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో, జార్ఖండ్‌కు సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం అల్పపీడన పరిస్థితి కొనసాగుతోంది అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రోజు తెలియజేసింది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదలిపోయే అవకాశం ఉండగా, ఝార్ఖండ్ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, రాబోయే మూడురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వివరించింది.
వివరాలు
తీరప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 60 నుంచి 90 కి.మీ
అదనంగా, సముద్రంలో గాలులు గంటకు సుమారుగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో, మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం నాడు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. అలాగే, కొన్ని తీరప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల మధ్య నమోదవడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు సంభవించాయని అధికారులు తెలిపారు.