Page Loader
Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల
మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2024
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా మొత్తం 40 మంది ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

Details

186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 9.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 26న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములకు ఇది అత్యంత కీలక పరీక్ష అని చెప్పొచ్చు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో కలిసి మహాయుతిగా బీజేపీ అధికారాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)తో కూడిన మహా వికాస్ అఘాడీ గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టార్ క్యాంపెయిన్ల జాబితా ఇదే