
Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.
దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) బుధవారం మరోసారి సమావేశంకానుంది.
ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. దాడి జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి అత్యవసరంగా సమావేశమైందన్న విషయం తెలిసిందే.
గత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
పహల్గాం ఘటనలో పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడమే కాకుండా, వారికి మద్దతు ఇస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది.
వివరాలు
సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేత
అంతేకాక, సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా నివారించేవరకు ఆ దేశంపై కఠినమైన ధోరణి కొనసాగించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది.
దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించే చర్యలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇదిలా ఉండగా, నిన్న ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.
పహల్గాంలో పరిస్థితులు, భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న చర్యల వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది.