Page Loader
Punjab: పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు.. మరింత దిగజారిన వాతావరణం
పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు

Punjab: పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు.. మరింత దిగజారిన వాతావరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజులో 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సీజన్‌లో ఈ సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఈ విషయం గురించి మీడియాకు వివరణ ఇచ్చారు. 404 వరకు కొత్తగా పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనలు ఫిరోజ్‌పూర్‌లో 74, భటిండాలో 70, ముక్త్‌సర్‌లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 చోటు చేసుకున్నాయి. ఫిరోజ్‌పూర్‌లో అత్యధిక సంఖ్యలో పంట వ్యర్థాలను తగులబెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

వాయు కాలుష్యాన్ని పెంచడంలో ప్రధాన కారణం

2022లో పంజాబ్‌లో ఒకే రోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకూ 8,404 పంట వ్యర్థాలు పంజాబ్‌లో తగలబెట్టినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, ఈ తరహా సంఘటనలు 75 శాతం తగ్గాయని అధికారులు చెప్పారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పంజాబ్, హర్యానాలో వరి పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలు భారీగా తగలబెట్టడం సాధారణమే. అయితే, ఈ చర్య దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని పెంచడంలో ప్రధాన కారణం అవుతోంది.