MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా అథారిటీ ఛైర్మన్ కె.మరిగౌడ ఆరోగ్య కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా ఆరోగ్య సమస్యలతో కూడుకున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరిగౌడ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, ఇటీవల ఆయన కారులో బెంగళూరుకు వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.
Details
ముడా
బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత, మైసూరులో మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సమాచారం. ఇప్పుడు ఆరోగ్యం కారణంగానే ఆయన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.
ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరిగౌడపై కూడా ఆరోపణలొచ్చాయి.
ప్రతిపక్షాలు ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో, ముడా చీఫ్ రాజీనామా చేయడం కన్నడ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఇదే సమయంలో, సిద్ధరామయ్యపై కొనసాగుతున్న విచారణ ఆయనపై మరిన్ని ఒత్తిళ్లను పెంచుతోంది.