
Best Airports: ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాలలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ విమానాశ్రయం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాను ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ + లీజర్ 2025 సంవత్సరానికి ప్రకటించింది. ఈసారి ఈ జాబితాలో టాప్ స్థానాన్నిటర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ ఆక్రమించింది. గత ఏడాది (2024) ఈ విమానాశ్రయానికి 95.79 పాయింట్లు లభించగా, ఈ ఏడాది అది మరింత మెరుగుపడి 98.57 స్కోరుతో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ విమానాశ్రయం గ్లోబల్ కనెక్టివిటీను వేగంగా విస్తరించడమే కాకుండా, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు అందించే నాణ్యమైన సేవల కారణంగా ప్రపంచస్థాయిలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందింది.
వివరాలు
చాంగీ రెండో స్థానం
ఎప్పుడూ అగ్రస్థానాల్లో ఉండే సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్ ఈసారి రెండవ స్థానానికి పరిమితమైంది. అలాగే, భారత్‌కు గర్వకారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ టాప్-10 జాబితాలో స్థానం దక్కించుకుంది. 2025లో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుల టాప్ 10 జాబితా: 1. ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం - స్కోరు: 98.57 2. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్ట్ - స్కోరు: 95.20 3. దోహా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ - స్కోరు: 92.34 4. అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం - స్కోరు: 89.48 5. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం - స్కోరు: 88.38 6.హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం - స్కోరు: 86.22 7.హెల్సింకి-వంతా ఎయిర్‌పోర్ట్ (ఫిన్లాండ్) - స్కోరు: 86.18
వివరాలు
ఆసియా, మిడిల్ ఈస్ట్ ఆధిపత్యం
8.హనేడా ఎయిర్‌పోర్ట్ (టోక్యో, జపాన్) - స్కోరు: 84.47 9.ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ - స్కోరు: 84.23 10. ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (దక్షిణ కొరియా) - స్కోరు: 83.67 ఈ సారి ప్రపంచ టాప్-10 జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా ఖండాలకు చెందిన విమానాశ్రయాలు ఆధిపత్యం కనబరిచాయి. మొదటి ఐదు స్థానాల్లో నాలుగు విమానాశ్రయాలు ఈ ప్రాంతాల నుంచే ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు అరుదైన గౌరవం ప్రయాణికుల అనుభవం పరంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి అత్యున్నత స్థాయి అయిన లెవెల్ 5 అక్రిడేషన్ లభించింది. ఇది అత్యున్నత కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ స్టాండర్డ్లను సూచిస్తుంది.