Page Loader
Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్ 
జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్

Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2024
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత హీట్‌ ఎక్కాయి. ఇప్పటికే ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. వైసీపీ సర్కార్‌ను అధికారం నుండి దించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన,బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్‌ సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేదరమెట్ల లో బహిరంగ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) పేర్కొంది.

Details 

జగన్‌ సిద్ధం సభకి సంబందించిన ఫొటోలను షేర్ చేసిన లోకేష్ 

అయితే, ఈ సభపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ తలపెట్టిన సిద్దం సభకు జనాలే రాలేదన్నారు. ఈ సభకు జనాలు భారీ ఎత్తున వచ్చారంటూ గ్రాఫిక్స్‌ లో చుపించారంటూ కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ఆయన X లో సీఎం జగన్‌ సిద్ధం సభకి సంబందించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ ఎక్స్‌ పోస్టు పెట్టిన నారా లోకేశ్.. ఒక గుంపు జనాన్ని పలు చోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను రిలీజ్ చేశారు. డ్రోన్ వీడియోలు, గ్రీన్‌ మ్యాట్‌తో సీఎం జగన్.. వైసీపీ నాయకులు దొరికిపోయారని అన్నారు. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలు వదిలారని విమర్శించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా లోకేష్ చేసిన ట్వీట్