LOADING...
Nara Lokesh: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ 
ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

Nara Lokesh: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిష్కారం, కేంద్ర పథకాల అమలు, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోకేశ్ ప్రధానితో చర్చించారు. ఈ సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. అలాగే, నేడు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. గత మే 17న, లోకేశ్ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ తో కలిసి ప్రధాని మోదీని కలిశారు. నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానమంత్రిని కలవడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ