NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ
    తదుపరి వార్తా కథనం
    లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ
    చంద్రబాబుని చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపణ

    లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 14, 2023
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు.

    దీనిపై తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. వ్య‌వ‌స్థ‌ల్ని చేతుల్లోకి తీసుకుని, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో భాగంగానే ఈ దారుణానికి ఒడిగడుతున్నారని ఆయన ఆరోపించారు.

    తమ అధినేతను అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భ‌ద్ర‌త‌లేని జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసి ప్రాణ‌హాని కలిగిస్తున్నారంటూ మండిపడ్డారు.

    చంద్రబాబు ఎప్పుడూ ఏ తప్పు చేయ‌లేదని, అలాంటి నేత పట్ల 73 ఏళ్ల వయసులో వైసీపీ ప్రభుత్వం రాక్ష‌సంగా ప్రవర్తిస్తోందని లోకేశ్ మండిపడ్డారు.

    details

    చంద్ర‌బాబుకి ఏం జ‌రిగినా, జ‌గ‌న్, జైలు అధికారుల‌దే పూర్తి బాధ్య‌త‌ : లోకేశ్

    రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని, ముద్దాయిగా హెల్త్ బులెటిన్ లో పేర్కొనడంపై ఎంతో శ్రద్ధపెట్టారన్నారు. కానీ ఆయన ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై మాత్రం అంత శ్రద్ధ పెట్ట‌ట్లేదన్నారు.

    జైల్లో దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పినా పట్టించుకోవట్లేదని, స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారని మొరపెట్టుకున్నా లెక్క చేయలేదన్నారు.

    ఏసీ సదుపాయం లేకున్నా కనీసం ఫ్యాన్ సైతం సరిగ్గా తిరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    బాబును అనారోగ్యానికి గురిచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు.

    ఆయనకు నాణ్యమైన వైద్యం అందంచడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిలైందంటూ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ నారా బ్రాహ్మణి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    నారా లోకేశ్

    తాజా

    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు నారా లోకేశ్
    'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు భారతదేశం

    నారా లోకేశ్

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    చిక్కుల్లో నటుడు పోసాని.. పరువు నష్టం దావా వేసిన లోకేశ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025