Delhi: రాష్ట్రపతిని కలిసిన ఎన్డీయే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి
నరేంద్ర మోదీ, ఎన్డీయే మిత్రపక్షాలు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని మోడీ కోరారు. తీర్మానాన్ని పత్రాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని రాష్ట్రపతి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం(జూన్ 9) భారతదేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం దిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీయే పక్షనేతగా మోడీని ఎన్నుకున్నారు.