Narendra Modi: 'సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు'.. ఫేక్ వీడియోపై ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
సోమవారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. అదే సమయంలో 2024 ఎన్నికలు భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంతోపాటు దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఈ ఎన్నికల లక్ష్యం అన్నారు.
ఇవన్నీ జరగడానికి మీ ఓటు మాత్రమే దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడమే తమ సంకల్పం అని ..మోడీ విజన్ స్పష్టంగా ఉందని అన్నారు.
Details
అవినీతికి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద..
కర్ణాటకను కూడా కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ వ్యక్తులు కర్ణాటక ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.
దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పని, దానికి బాధ్యత ఇస్తారా? అందరి అవినీతికి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా దోపిడీ పాలన నడుస్తోందన్నారు.
మీ ఓటు బలం మోడీకి బలం చేకూరుస్తుందని అన్నారు. కాలక్షేపం చేసే వారు భారతదేశాన్ని అభివృద్ధి చేయలేరు. దేశం కోసం పనిచేయాలంటే విజన్ కావాలి. ఏమీ లేనప్పుడు ఫలితం శూన్యం, కానీ మా విషయంలో, విజన్, నినాదం రెండూ స్పష్టంగా ఉన్నాయన్నారు.
Details
బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావించిన ప్రధాని మోదీ
2047 కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని మోదీ అన్నారు.
సోషల్ మీడియాలో నా వాయిస్‌తో అసభ్యకరమైన విషయాలు పోస్ట్ చేస్తున్నారు.
నా డీప్‌ఫేక్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
షెడ్యూల్డ్ కులాలు,తెగల హక్కులను కాంగ్రెస్ హరిస్తోందన్నారు.బుజ్జగింపు కోసం కాంగ్రెస్ ఎంతవరకైనా వెళుతుందన్నారు.
ఒకవైపు బీజేపీ ప్రభుత్వం తల్వారా వర్గానికి ఎస్టీ హోదా కల్పించింది. మరోవైపు కర్ణాటకలో రాజ్యాంగాన్ని మార్చాలని,ఎస్టీల హక్కులను కాలరాయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది.
ఇదొక్కటే కాదు, ప్రధాని మోడీ తన ర్యాలీలో బాలాకోట్ వైమానిక దాడులను కూడా ప్రస్తావించారు.
బాలాకోట్‌లో వైమానిక దాడి తర్వాత తాను మొదట పాకిస్థాన్‌కు ఫోన్ చేసి తర్వాత ప్రపంచానికి తెలియజేశానని చెప్పారు.