
Ncp-Sharad Pawar-Modi: మాజీ ప్రధానుల గురించి తర్వాత...ముందు మీరేం చేశారో చెప్పండి మోదీగారు: శరద్ పవార్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై ఎన్సీపీ (Ncp) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మండిపడ్డారు.
నవ భారత నిర్మాణం కోసం మాజీ ప్రధానులు పనిచేస్తే వారిని ప్రధాని నరేంద్ర మోదీ వారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రూ (Nehru), ఇందిరాగాంధీ (Indira Gandhi), రాజీవ్ గాంధీ (Rajeev Gandhi), మన్మోహన్ సింగ్ (Manmohan singh) నవభారతాన్ని నిర్మించేందుకు వారు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
నెహ్రూ , ఇందిరా, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ చేసిన సేవల్ని భారత ప్రజలు గుర్తుంచుకున్నారని తెలిపారు.
వారు చరిత్రలో నిలిచిపోయారని, వారిని మాత్రం మోదీ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
Sharad Pawar-Modi
పదేళ్లుగా మోదీ ఏం చేశారో
గత పదేళ్లుగా మోదీ తన ప్రజలకు ఏం చేశారో మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చడం గురించి కొందరు బీజేపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారని చెప్పారు.
ప్రజల్లో ప్రధాని మోదీ భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.