Page Loader
GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..
జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.

GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో,మలేషియాలో ఏర్పాటు చేసిన శిబిరం నుంచి ఎన్డీయే కూటమిలోకి చెందిన కార్పొరేటర్లు ఈ రోజు (ఏప్రిల్ 18న) విశాఖ నగరానికి చేరుకోనున్నారు. వీరు విమానాశ్రయం నుంచి నేరుగా భీమిలిలో ఉన్న శిబిరానికి తరలించబడతారని,ఈ చర్యకు తెలుగు దేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో, ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

వివరాలు 

జీవీఎంసీ ఆఫీసులో వద్ద 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు.. 

GVMC చుట్టుపక్కల ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలను అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ సమావేశం పూర్తిగా పారదర్శకంగా సాగేలా జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు మాత్రమే GVMC పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది. మిగిలిన వారెవరూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించరాదు. భద్రతా చర్యల నిమిత్తంగా సుమారు 300 మంది పోలీసులను GVMC కార్యాలయం చుట్టూ మోహరించే అవకాశం ఉంది.