New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, మూడు రాష్ట్రాల గవర్నర్లను మార్చినట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ గవర్నర్‌గా జిష్షుదేవ్ వర్మను నియమించినట్లు తెలిసింది. ఇక జార్ఖండ్ గవర్నర్‌గా సంతోష్ కుమార్ గంగ్వార్, సిక్కిం గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్, రాజస్థాన్ గవర్నర్‌గా హరిబౌ కిషన్ రావు, మేఘాలయ గవర్నర్‌గా విజయ్ శంకర్, చత్తీస్ గఢ్ గవర్నర్ గా రామెనె దేకాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
అయితే పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా కె.కైలాష్ నాథన్ ఎంపికయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌కు వెళ్లినట్లు సమాచారం. అసోం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ పంజాబ్ గవర్నర్ గా, సిక్కిం గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అసోం గవర్నర్‌గా ఎంపికయ్యారు. ఇక లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు లభించాయి.