కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!
పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో (మే) ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) ఇటీవల పూలతో పాటు ఇతర అలంకరణల కోసం రూ.14లక్షల టెంటర్లకు పిలిచిన నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించే వార్తను అధికారంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ కొత్త భవనంలోని లోక్‌సభ, రాజ్యసభను మార్చిలో ఆకస్మికంగా సందర్శించారు. వాటి నిర్మాణ పురోగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు సంబంధించి కొనసాగుతున్న పనులపై సమీక్ష జరుగుతోందని అధికారి తెలిపారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, సీపీడబ్ల్యూడీ డైరెక్టర్ జనరల్ శైలేంద్ర శర్మ, పలువురు ఇతర సీనియర్ అధికారులు పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి