Page Loader
NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 
NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2024
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది బెంగళూరులో నమోదైన ఉగ్రవాద కుట్ర కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో NIA సోదాలు నిర్వహిస్తోంది. అబ్దుల్ కుమారుడు సోహైల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్‌ ఎస్‌బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనంతపురంలో NIA సోదాలు