కేరళలో నిఫా విజృంభణ.. సెప్టెంబర్ 24 వరకు కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలు బంద్
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికిస్తోంది. ఈ మేరకు కోజికోడ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సెప్టెంబర్ 24 వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయించారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి వ్యాక్సిన్‌లను తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి మొత్తం ఐదుగురు వైరస్ బారిన పడ్డారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో నిఫా కేసు నమోదైంది.కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు పాజిటివ్ వచ్చింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. వైరస్ సోకిన మొత్తం ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు మరణించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. నిఫా సోకిన వారితో పరిచయమున్న వారి జాబితా 1080కి చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.