Page Loader
Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 
వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా

Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రివర్గం ఈ బడ్జెట్‌కు ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఒక రికార్డు నెలకొల్పారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్‌ 'వికసిత భారత్‌' లక్ష్యానికి మద్దతు ఇస్తూ, భారత్‌ ఈ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆమె ప్రసంగం ప్రారంభంలో విపక్షాల నినాదాల మధ్యే ఈ ప్రకటన చేసింది.

Details

1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు

ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మెరుగైన అవసరాలు, ప్రణాళికపై దృష్టి పెట్టారు. 'సబ్‌ కా వికాస్' అనే లక్ష్యంతో ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనాలు అందించనున్నాయి. అలాగే, సున్నా శాతం పేదరికాన్ని లక్ష్యంగా తీసుకుని ఆ దిశగా కార్యాచరణ చేపడతామని చెప్పారు. 2025-26లో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్య ఉండే అంచనాను ప్రకటించారు. భారత్‌ ప్రస్తుతంలోని అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచిపోతుందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సంభందించిన మార్పులు, మెరుగుదలలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు.

Details

 భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు 

ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థకు మరింత నిధులు సమకూర్చి వృద్ధి శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. 70 శాతం ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొంటారని అంచనా వేసారు. మహిళల ప్రోత్సాహంతో ఈ బడ్జెట్‌ భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకునేందుకు రూపొందిస్తామని నిర్మలమ్మ తెలిపారు . మొత్తంగా ఈ బడ్జెట్‌ 'వికసిత భారత్‌' లక్ష్యంతో భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.