Page Loader
Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల
కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చినట్లు ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా, తెలంగాణ పరిస్థితి ఎందుకు మారలేదని ఆమె ప్రశ్నించారు. విభజన తర్వాత రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పాలకులు అప్పుల భారంగా మార్చేశారని విమర్శించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం, నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఇచ్చామని, జహీరాబాద్‌కు పారిశ్రామిక నోడ్ కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టులో ఆమోదం తెలిపిందని వివరించారు.

వివరాలు 

కేంద్రం చేసిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు: 

కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి విభజన హామీలు ఏ మేరకు నెరవేరాయో ప్రశ్నించగా, ఆర్థికమంత్రి రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయ సహకారాల గురించి విశ్లేషించారు. విభజన చట్టం ప్రకారం సమ్మక్క-సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన. 2014 నుంచి 2,605 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం. భారత్‌మాల ప్రాజెక్టు కింద నాలుగు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల మంజూరు. రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయింపు. 753 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం. 5 వందే భారత్ రైళ్ల ప్రారంభం. 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ. పట్టణ ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణం.

వివరాలు 

కేంద్రం చేసిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు: 

స్వచ్ఛభారత్ మిషన్ కింద 31 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం. జల్ జీవన్ మిషన్ ద్వారా 38 లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా. 82 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డుల మంజూరు. 199 జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. 1.2 లక్షల జన్ ధన్ ఖాతాల ప్రారంభం. 75 లక్షల ముద్రా లోన్లు మంజూరు. 9 వెనుకబడిన జిల్లాలకు రూ.2,700 కోట్లు విరాళం. మెదక్‌కు తొలి రైల్వే స్టేషన్, రామగుండం ఎరువుల కర్మాగార పునరుద్ధరణ మెదక్ పార్లమెంటరీ ప్రాంతానికి తొలి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంజూరు చేశారని, అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిందీ కేంద్ర ప్రభుత్వమేనని నిర్మలా సీతారామన్ తెలిపారు.

వివరాలు 

కాంగ్రెస్‌పై కౌంటర్: 

కాంగ్రెస్ పార్టీ కేవలం విమర్శలు చేస్తూ, ప్రజలకు నైతికమైన సమాధానాలు ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ముఖ్యమైన బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా అనేక విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు. కేంద్రం తన న్యాయమైన పన్నుల వాటా కూడా తెలంగాణకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలు చేయడంతో,నిర్మలా సీతారామన్ ప్రతిస్పందిస్తూ,దేశ ప్రజలు కాంగ్రెస్‌ను ఇప్పటికే తిరస్కరించారని అన్నారు. మహాత్మా గాంధీ 1947లోనే కాంగ్రెస్‌ పార్టీ రద్దు కావాలని సూచించారని,అయినప్పటికీ, కాంగ్రెస్ ఇంకా భారత రాజకీయాల్లో వేలాడుతోందని వ్యాఖ్యానించారు.