Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు
భారత ఎన్నికల సంఘం(ఈసి) మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఫలితాలను ప్రకటించిన తర్వాత రాజకీయం కొత్త పుంతులు తొక్కింది. బీజేపీ కేవలం 240 సీట్లు సాధించిది. మెజారిటీ మార్కు 272కి తగ్గాయి. కాగా కాంగ్రెస్ 99 గెలుచుకుంది. లోక్‌సభలో బిజెపికి మెజారిటీ తక్కువగా ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌డిఎకి మిత్రపక్షాలు అవసరం. బీహార్ ముఖ్యమంత్రి , జెడి(యు) అధినేత నితీష్ కుమార్ , ఎపికి కాబోయే ముఖ్యమంత్రి, టిడిపి బాస్ ఎన్ చంద్రబాబు నాయుడులపై ఎన్‌డిఎ ఆధారపడనుంది.
ఎన్‌డిఎ మనుగడ చంద్రబాబు, నితీష్ చేతుల్లోనే..
లోక్‌సభలో బిజెపికి మెజారిటీ తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌డిఎ మిత్రపక్షాలు అవసరం. ఈ పరిస్ధితుల్లో బీహార్ ముఖ్యమంత్రి జెడి(యు) అధినేత నితీష్ కుమార్ , టిడిపికి ఎన్ చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్‌లుగా ఎదిగారు. గతంలో రెండు సంకీర్ణ-ప్రభుత్వాల హాయంలో ఓ వెలుగు వెలిగిన వీరిద్దరి అవసరం ఎంతైనా వుంది ఎన్‌డిఎకి .
నితీష్ పూర్వాపరాలివే
పూర్వపు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కు వ్యతిరేకంగా నితీష్ తిరుగుబాటు చేశారు. కాగా, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు దివంగత జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి నితీష్ కుమార్ సమతా పార్టీని స్ధాపించారు. 1990ల మధ్యకాలం నుంచి బీజేపీతో సంబంధాలు కొనసాగించారు. అంతకు ముందు మాజీ ప్రధాని వీపీ సింగ్ స్థాపించిన జనతాదళ్‌లోనితీష్ వుండే వారు.