
Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.
దేశ చరిత్రలో 9సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడు లేరు. ఆ ఘనత సాధించిన ఏకైక నేత నితీశ్ కుమార్ కావడం గమనార్హం.
కేవలం 24ఏళ్లలోనే నితీష్ కుమార్ తొమ్మిదిసార్లు ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్ల కాల వ్యవధిలో రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
నితీష్ కంటే ఎక్కువకాలం సీఎంలుగా ఉన్న వారు కూడా ప్రమాణస్వీకారం విషయంలో ఆయన రికార్డుకు దరిదాపుల్లో కూడా లేరు.
ఈ క్రమంలో నితీష్ తర్వాత ఎక్కువసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్
నితీష్ కుమార్ ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారంటే..
మొదటిసారి - మార్చి 3, 2000
2వ సారి - నవంబర్ 24, 2005
3వసారి - నవంబర్ 26, 2010
4వ సారి - - ఫిబ్రవరి 22, 2015
5వ సారి- నవంబర్ 20, 2015
6వ సారి - జూలై 27, 2017
7వ సారి- నవంబర్ 16, 2020
8వ సారి- ఆగస్టు 9, 2022
9వ సారి- జనవరి 28, 2024
ప్రమాణస్వీకారం
వీరభద్ర సింగ్ ఆరుసార్లు
నితీష్ కుమార్ తర్వాత హిమాచల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ 6 సార్లు ప్రమాణస్వీకారం చేశారు.
1983లో తొలిసారి సీఎం అయిన వీరభద్ర సింగ్ 1985లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత 1993, 1998, 2003, 2012 సంవత్సరాల్లో సీఎం కూడా అయ్యారు.
జయలలిత ఆరుసార్లు
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత కూడా 6 సార్లు సీఎం అయ్యారు. 1991లో తొలిసారి సీఎం అయిన జయలలిత రెండోసారి సీఎం కావడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.
2001లో రెండోసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2002, 2011, 2015, 2016లో ఆమె తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం
పవన్ కుమార్ చామ్లింగ్: ఎక్కువ కాలం సీఎంగా ఉన్నా.. నితీష్ తర్వాతే..
దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. చామ్లింగ్ వరుసగా 5సార్లు సీఎంగా కొనసాగారు.
1994లో తొలిసారి సీఎం కాగా, ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 వరకు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించి మొత్తం 28ఏళ్లు సీఎంగా కొనసాగారు. కానీ ఈయన కేవలం ఐదుసార్లు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.
జ్యోతిబసు 5సార్లు
చామ్లింగ్ కంటే ముందు అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉండేది.
బసు 1977 నుంచి 2000 వరకు వరుసగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన ఐదుసార్లు మాత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం
గెగాంగ్ అపాంగ్ ఐదుసార్లు..
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ కూడా 5 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు.
1980లో అపాంగ్ తొలిసారి సీఎం అయ్యారు. 1985, 1990, 1995లో సీఎం అయ్యారు. చివరిగా అంటే ఐదోసారి 2004లో ఆపంగ్ సీఎంగా ప్రమాణం చేశారు.
నవీన్ పట్నాయక్ ఐదుసార్లు
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఐదుసార్లు సీఎం అయ్యారు.
నితీష్ లాగానే నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఒడిశాలో నిరంతరం సీఎంగా కొనసాగుతున్నారు. గత 23 ఏళ్లుగా సీఎంగా కూడా ఉన్నారు.