LOADING...
No helmet - No petrol: 'నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!
'నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!

No helmet - No petrol: 'నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ చర్యలలో భాగంగా,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వస్తే, వారికి ఇంధనం ఇవ్వకుండా నిరాకరించాలని నిర్ణయించింది. ఈనిర్ణయం 2025 ఆగస్టు 1 నుండి అమలులోకి రానుందని అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం మంగళవారం జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో తీసుకున్నారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే సూచనల మేరకు బుధవారం అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అలాగే కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.

వివరాలు 

ఆదేశాలను పాటించకతే పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు

ఈ నేపథ్యంలో,ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకుకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఇంధనం అందించకుండా నిరాకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఇందౌర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ స్పష్టం చేశారు. ఈఆదేశాలను పాటించకతే,సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంబంధిత బంకు యజమానులకు ఏడాది వరకు జైలుశిక్ష లేదా రూ.5వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు,ఇందౌర్ రోడ్లపై చోటు చేసుకుంటున్న ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసమస్యను గమనించి, అలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఈనేపథ్యంలోనే,ఇందౌర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక చర్యలను అమలు చేస్తోంది.