Page Loader
PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావులేదు.. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ
జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావులేదు.. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై స్పందన ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను మానవత్వంపై జరిగిన అఘాయిత్యంగా అభివర్ణించారు. "ఉగ్రవాదంపై ద్వంద్వ నైతికతలకు ఎటువంటి చోటు ఉండకూడదు. ఇది మానవాళికి భయంకరమైన శత్రువు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకించాలి," అని మోదీ తెలిపారు.

వివరాలు 

గ్లోబల్ సౌత్ దేశాల పరిస్థితిపై మోదీ ఆవేదన 

గ్లోబల్‌ సౌత్‌ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆహార లోపం,ఇంధన కొరత, ఎరువుల కష్టాలు,ఆర్థిక సంక్షోభం వంటి సవాళ్లను మొదటగా ఎదుర్కొంటున్నవారు వారేనని పేర్కొన్నారు. అలాంటి దేశాల ఆందోళనలు,అవసరాలను ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించడం భారత బాధ్యతగా భావిస్తున్నామని వెల్లడించారు. డీప్‌ఫేక్, కృత్రిమ మేధస్సు విషయంలో అప్రమత్తతపై హితవు డీప్‌ఫేక్ అనే సాంకేతిక మోసంపై కూడా మోదీ గంభీరంగా స్పందించారు."AI ద్వారా సృష్టించబడిన కంటెంట్‌పై స్పష్టమైన గుర్తింపు లేదా వాటర్‌మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.ఇది ప్రజల్లో భయాన్ని కలిగించే అంశం.ఈశతాబ్దంలో సాంకేతికత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరం.కృత్రిమ మేధస్సు చుట్టూ ఉన్న భయాలను తొలగించి,నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి" అని ప్రధాని హితవు పలికారు.

వివరాలు 

ప్రపంచ నేతలతో మోదీ సమావేశాలు 

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా వంటి అనేక ప్రపంచ నేతలతో సమావేశమయ్యారు. క్రొయేషియా పర్యటనకు తొలిసారి భారత ప్రధాని తొలి సారి భారత ప్రధాని క్రొయేషియా పర్యటనకు సిద్ధమవుతున్నారని సమాచారం. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ నేడు ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నట్టు వెల్లడించారు.