
రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్
ఈ వార్తాకథనం ఏంటి
రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
ఇంకా సమయం ఉన్నందున మూకుమ్మడిగా బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. రూ.2,000 నోట్లను మార్చుకునే క్రమంలో హెచ్-1బీ వీసాదారులతో సహా నాన్-రెసిడెంట్ భారతీయులు (ఎన్ఐఆర్‌లు) ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదన్నారు.
రూ.2,000 కరెన్సీ ఉపసంహరించుకోవాలని ఆదేశించినప్పటికీ, ఈ నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. దుకాణదారులు ఈ నోట్లను స్వీకరించడానికి నిరాకరించకూడదని దాస్ పేర్కొన్నాడు.
కరెన్సీ
వినియోగదారులకు చిరిగిన నోట్లను జారీ చేయొద్దు: ఆర్‌బీఐ
సెప్టెంబర్ 30 నాటికి దాదాపు అన్ని రూ. 2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు వస్తాయని శక్తికాంత దాస్ తెలిపారు.
అయితే రూ.2వేల నోట్లను మార్చుకునే క్రమంలో వినియోగదారులకు తడిసిన లేదా చిరిగిన నోట్లను జారీ చేయవద్దని బ్యాంకులను కోరారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో బ్యాంకులకు వచ్చే కస్టమర్ల కోసం వాతావరణానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించారు.
నాలుగేళ్ల క్రితమే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.