
Revanth Reddy: తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రాజెక్టుల రూపంలో పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)సంసిద్ధత వ్యక్తం చేసింది. శనివారం ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదగా కలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో భారీపెట్టుబడులు పెట్టనున్నట్లు వారు తెలిపారు. సోలార్,పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఎన్టీపీసీ ప్రత్యేకంగా ఆసక్తి చూపుతూ,ఈరంగాల్లో పెట్టుబడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా,తెలంగాణలో 6,700మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఎన్టీపీసీ బృందం సీఎం గురుదీప్ సింగ్‌కు తెలియజేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆహ్వానిస్తూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈపెట్టుబడులను ఎటువంటి అడ్డంకులేకుండా అన్ని విధాలా సమర్థంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న ఎన్టీపీసీ
తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి తెలియజేసింది. @ntpclimited చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో… pic.twitter.com/0f8FBcisHY
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2025