యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21- 25 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్‌ను పెంపొందించే మొత్తం చర్యల్లో కీలకమైనది 'యోగా డే'.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తొలి ఏడాదే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతిపాదించారు. దీనికి ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం తెలిపింది.
యోగా
ఐక్యరాజ్య సమితిలో యోగా డే వెనుక పొలిటికల్ వ్యూహం ఉందా?
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమ సర్కారు సాధించిన విజయాల గురించి నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా వేడుకలను ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని మోదీ నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా యోగా డేను అంతర్జాతీయంగా జరుపుకోవడంలో మోదీ విశేషమైన కృషి ఉందనే మెసేజ్‌ను భారత ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
180 దేశాలకు చెందిన ప్రతినిధులు యోగా దినోత్సవ పాల్గొనేనా ఏర్పాట్లు చేస్తున్నారు.