NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు
    తదుపరి వార్తా కథనం
    Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు
    గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు

    Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2024
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వ్యక్తిగత కక్షల కారణంగా 14 ఏళ్ళ బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.

    హత్యానంతరం ఆమె మృతదేహాన్ని నిందితుడు తన గదిలో దాచిపెట్టి పారిపోయాడని పోలీసులు సోమవారం తెలిపారు.

    గురుగ్రామ్‌లోని సిలోఖ్రా గ్రామంలో గ్యానీ థాపా,బహదూర్ నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి.

    ఫిబ్రవరి 9న రాత్రి 9 గంటల సమయంలో కామన్ టాయిలెట్ నుండి సబ్బు తీసుకురావడానికి వెళ్ళిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు.

    అదే సమయంలో నిందితుడు బహదూర్ తన గది బయట నిలబడి ఉన్నాడు. బాలిక తండ్రి గ్యానీ థాపా తన కుమార్తె గురించి అడిగినప్పుడు, బహదూర్ బాలిక ఆహారం కొనడానికి బయటకు వెళ్లిందని తెలిపాడు.

    Details 

    పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసిన నిందితుడు 

    అయితే తండ్రికి అనుమానం వచ్చి బహదూర్ గదిలో చూడాలని డిమాండ్ చేశాడు. బహదూర్ తిరస్కరించడంతో , థాపా బలవంతంగా అతని గదిలోకి ప్రవేశించాడు.

    అక్కడ, దుప్పటిలో చుట్టి ఉన్న తన కుమార్తె మృతదేహాన్ని కనుగొన్నాడని, పోలీసులు తెలిపారు. దీంతో బహదూర్ అక్కడి నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు.

    పోలీసు బృందం బాధితురాలి ఇంటికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడు పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసాడు.

    తండ్రి ఫిర్యాదు ఆధారంగా బహదూర్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 302 (హత్య) కింద సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పిటిఐ నివేదించింది.

    Details 

    ఆరు నెలల వీరి కుటుంబాల మధ్య వివాదం

    ఆరు నెలల ముందు బహదూర్ మొబైల్ ఫోన్, నగదును దొంగిలించాడని థాపా పై ఆరోపణలు చేశాడు. అప్పటి నుండి వీరి కుటుంబాల మధ్య వివాదం ప్రారంభమయ్యింది.

    బాధితురాలి తండ్రి థాపా తన ఫిర్యాదులో తాను వేరే అద్దె ఇంట్లోకి మకాం మార్చాడని, అయితే బహదూర్ కూడా అక్కడికే అద్దెకు వచ్చాడని పేర్కొన్నాడు.

    నిందితుడి అరెస్టు తర్వాతే హత్య వెనుక ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) మనోజ్ కుమార్ తెలిపారు.

    నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గురుగ్రామ్‌

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    గురుగ్రామ్‌

    Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య  భారతదేశం
    Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య భారతదేశం
    Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025