జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 23న తొలి సమావేశం
జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక అధ్యయన నివేదికను కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ మేరకు దేశంలోని 3 అంచెల్లో లోక్‌సభ నుంచి పంచాయతీ వరకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపుగా రూ. 10 లక్షల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ఒకే దేశం,ఒకే ఎన్నికకు సంబంధించిన తొలి సమావేశం 2023 సెప్టెంబర్ 23న జరుగుతుందని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు, కావాల్సిన నియమ నిబంధనలను కమిటీ రూపొందించే పనిలో నిమగ్నమైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్'కు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 జరగనున్నాయి. ఈ మేరకు చట్టసభలో కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహణకు ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.