LOADING...
KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్
హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్

KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌' (X) వేదికగా ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ఇటీవల ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ అల్ట్‌మన్‌ (Sam Altman) భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే సెప్టెంబర్‌లో భారత్ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌, ఆయనకు స్వాగతం పలికారు. భారత్‌కు గేట్‌వేగా హైదరాబాద్‌ను అభివర్ణిస్తూ, ఓపెన్‌ఏఐ వంటి అత్యాధునిక సంస్థలకు ఇది ఆదర్శవంతమైన కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.