
Operation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'.. పేరులోనే బలమైన సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీవ్రంగా స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకార దాడికి భారత దళాలు శ్రీకారం చుట్టాయి.
'ఆపరేషన్ సిందూర్' పేరిట చేపట్టిన ఈ సోదాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ చర్యతో అంతర్జాతీయ వేదికపై దృష్టిని ఆకర్షించింది. "ఆపరేషన్ సిందూర్" అనే పేరుతోనే పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం గట్టి హెచ్చరిక పంపినట్లయ్యింది.
వివరాలు
యోధులకు వాడే "వీరతిలకం"
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయలో విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.
ముఖ్యంగా,జంటలుగా ఉన్న వారిమధ్య పురుషులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారి మతాన్ని ప్రశ్నించి అనంతరం కాల్చి హత్య చేసిన ఉదంతం కలచివేసింది.
దాడికి గురైన దంపతుల్లో కొత్తగా పెళ్లైన వినయ్ నర్వాల్ మరియు హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను క్రూరంగా హత్య చేయగా,అతని మృతదేహం వద్ద హిమాన్షి విలపిస్తున్న దృశ్యం దేశవ్యాప్తంగా ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది.
వినయ్ నేవీ అధికారిగా కూడా ఉన్నాడు.ఈదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల బాధను ప్రతీకగా తీసుకుని భారత్ ఈ ప్రతీకార చర్య చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాక,యోధులకు వాడే "వీరతిలకం"అనే భావనకూ ఈ ఆపరేషన్ పేరు అర్థాన్ని కలిగిస్తోంది.
వివరాలు
ఉగ్రవాద సంస్థల కీలక శిక్షణ శిబిరాలునాశనం
ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి.
కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల కీలక శిక్షణ శిబిరాలను నాశనం చేశాయి.