Page Loader
రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి
రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి

రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 03, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ అల్లర్లపై విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏ రూల్ ప్రకారమైనా చర్చలు చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమని ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రంలోని దుస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకటన చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో పాత వైఖరినే కొనసాగిస్తామని వెల్లడించింది.వర్షాకాల సమావేశాలు ప్రారంభం మొదలు మణిపూర్ అంశం ఉభయసభల్లో దుమారం రేపుతోంది.సభా కార్యకలాపాలు ఒక్కరోజూ సక్రమంగా నడవలేదు. మణిపూర్‌ అంశంపై రూల్‌ 176 కింద చర్చలకు తాము రెడీ అని కేంద్రం అంటోంది. రూల్ 176 వద్దని, రూల్‌ 267 కిందే చర్చించాలని విపక్ష కూటమి భీష్మించింది. విపక్షాల తాజా నిర్ణయంతో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంటకు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్ అంశంపై ఫ్లోర్ లీడర్లతో చర్చ