
Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు.ఈసందర్భంగా రాష్ట్రంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో రూ.48,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి,గురువారం జాతికి అంకితం చేస్తారని బుధవారం PMO ప్రకటన తెలిపింది.
ముందుగా మధ్యాహ్నం అహ్మదాబాద్‌కు ప్రధాని చేరుకుంటారు.అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1.25 లక్షల మందికి పైగా రైతులు హాజరయ్యే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్)స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర పశుసంవర్ధక శాఖమంత్రి పురుషోత్తం రూపాలా,గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Details
వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన
మధ్యాహ్నం 12:45 గంటలకు, ప్రధానమంత్రి మెహసానాకు చేరుకుని 'పూజ' చేసి వాలినాథ్ మహాదేవ్ ఆలయంలో 'దర్శనం' చేస్తారు.
ఆ తర్వాత మహేసన,నవ్‌సారిలో జరిగే రెండు బహిరంగ సభలలో మోదీ పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో ఆయన రూ. 25,850 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు.
అలాగే, ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు.
సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే తొలి స్వదేశీ అణు విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది