LOADING...
కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే
మియా ముస్లింలపై సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు.. ఓవైసీ కౌంటర్

కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 15, 2023
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వల్లే గువాహటిలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. మియాలంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారని బిశ్వ అన్నారు. ముస్లిం అమ్మకందారులు కూరగాయల ధరలను పెంచుతున్నారని, అదే అస్సామీలైతే అధికంగా వసూలు చేయబోరని తెలిపారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. గేదె పాలివ్వకపోయినా, కోడి గుడ్లు పెట్టకపోయినా మియాభాయ్‌నే కారణం అనేలా ఉన్నారని చరకలు అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీ ముస్లింలతో స్నేహం ఉందని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేశారు. టమాటాలు, బచ్చలికూర, ఆలుగడ్డలను ఎగుమతి చేయాలని విదేశీ ముస్లింలను కోరమని మోదీకి చెప్పాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిమంతకు కౌంటర్‌గా ఓవైసీ చేసిన ట్వీట్