NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / P4 Model: ఏపీలోని  ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    P4 Model: ఏపీలోని  ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు 
    ఏపీలోని ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

    P4 Model: ఏపీలోని  ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం"పీ-4 జీరో పావర్టీ"అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

    ఈ ప్రోగ్రామ్‌లో ఎంపిక చేసిన పదిమంది పేదల పేర్లను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    ఇది ఆయన లబ్ధిదారుల పేర్లను ప్రకటించడం మొదటిసారి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో ఇవాళ పర్యటించిన చంద్రబాబు,ఆగ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా,పీ4ప్రోగ్రామ్‌లో గుర్తించిన పది మంది పేదల పేర్లను చంద్రబాబు ప్రకటించి,వారి జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

    పేదరికంతో బాధపడుతున్న,కూలీ పనులు చేసి,క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఓమహిళ ధీన పరిస్థితి గురించి తెలుసుకున్న చంద్రబాబు,ఆమెకు వైద్యం చేయించడానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

    వివరాలు 

    రాజకీయ పార్టీలు నన్ను విమర్శిస్తున్నాయి: చంద్రబాబు 

    పీ4 ప్రోగ్రామ్‌లో పేదలను దత్తత తీసుకున్న సంపన్నులు ఎవరైనా మధ్యలో చేతులెత్తేస్తే ,వారి స్థానంలో కొత్తవారు వస్తారని,కానీ పీ4 యజ్ఞం మాత్రం కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    కొన్ని రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.వారికి చేతనైతే, 100 మందిని దత్తత తీసుకుని వారి జీవితాలను బాగు చేయాలని సూచించారు.

    అలాచేస్తే, శాలువా కప్పి, పూలమాల వేసి వారికి గౌరవం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

    పీ4 ప్రోగ్రామ్‌లో ఫార్మా కంపెనీ అధినేత విక్రం నాగేశ్వరరావు ముందుకు వచ్చారు.

    ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉన్న 9వ తరగతి విద్యార్థిని చదవించే బాధ్యతను తీసుకున్న విక్రం, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే? ఆంధ్రప్రదేశ్
    Sonusood: ఏపీకి సాయం.. సోనూసూద్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి భారతదేశం
    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025