
Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడి, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
Details
రాజకీయాలకతీతంగా సమిష్టి కృషి అవసరం
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రాజకీయాలకతీతంగా సమిష్టి కృషి అవసరమని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే దిశగా స్పందించారు.
పహల్గామ్ ఉగ్రదాడి, భారత్-పాక్ కాల్పుల విరమణ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు
. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని తనకు నమ్మకముందని ఖర్గే తెలిపారు.