Loading...
Supreme Court: ఢిల్లీలో వరుస అత్యాచారాలు.. నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు
ఢిల్లీలో వరుస అత్యాచారాలు.. నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు

Supreme Court: ఢిల్లీలో వరుస అత్యాచారాలు.. నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయన్న సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను సీరియస్‌గా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం.. అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సుమోటో పిల్‌ను వెంటనే రిజిస్టర్ చేసి విచారణకు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

వివరాలు 

17 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌.. తీవ్రంగా స్పందించిన కోర్టు

కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ సామూహిక అత్యాచార ఘటనను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.

సెప్టెంబర్ 21న ముగ్గురు వ్యక్తులు పోలీసులుగా నటించి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన మీడియా కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఒక్క నెలలోనే 13 అత్యాచార కేసులు

ఢిల్లీలో కేవలం సెప్టెంబర్ నెలలోనే కనీసం 13 లైంగిక దాడి కేసులు నమోదైనట్లు కోర్టు దృష్టికి వచ్చింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు.. చట్ట అమలు, ప్రజా భద్రతా వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

వివరాలు 

"పరిస్థితులు నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్నాయి"

ఈ సందర్భంగా జస్టిస్ పర్దీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు 2012లో జరిగిన నిర్భయ ఘటనను మరోసారి గుర్తుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్భయ ఘటన జరిగి దశాబ్ద కాలం దాటినా.. వ్యవస్థల్లో నిజంగా సమర్థవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

మహిళలకు హైరిస్క్‌ జోన్లుగా మారకూడదు

ఢిల్లీలోని పార్కులు, రహదారులు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు మహిళలకు హైరిస్క్‌ ప్రాంతాలుగా మారకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా, హింస భయం లేకుండా జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

అధికారుల జవాబుదారీతనం ఫిక్స్ చేయాలి

అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేయడంతో మాత్రమే సరిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నేరాల నివారణ, ప్రజా శాంతి పరిరక్షణ, బాధితులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమయ్యే బాధ్యతారాహిత్య అధికారులపై కచ్చితంగా జవాబుదారీతనం నిర్ణయించాలని ధర్మాసనం తీవ్రంగా పేర్కొంది.

ADVERTISEMENT