Page Loader
Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు
పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్థాన్‌ దాడులకు దిగింది. అందులో భాగంగా జమ్ముకశ్మీర్‌తోపాటు, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యాణా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. అయితే భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ విషయమై భారత ఆర్మీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

వివరాలు 

ప్రజల భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం భారత ఆర్మీ ప్రధాన కర్తవ్యం

''డ్రోన్లు,వివిధ రకాల ఆయుధాలతో పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌ ఎల్‌ఓసీ వద్ద పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్‌ డ్రోన్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొని వాటిని తిప్పికొటాం. ప్రజల భద్రతతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం భారత ఆర్మీ ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం. పాకిస్థాన్‌ కుట్రలకు తక్షణమే స్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం'' అని భారత సైన్యం ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ 

వివరాలు 

సైనిక స్థావరాలు ప్రధాన లక్ష్యం 

పాకిస్థాన్‌ దాడుల్లో ముఖ్యంగా భారత సైనిక స్థావరాలు ప్రధాన లక్ష్యంగా నిలిచాయి. జమ్మూ విమానాశ్రయం, అక్కడి సైనిక కేంద్రాలపై దాడులకు యత్నించింది. పాక్‌ పంపిన డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని నేలమట్టం చేశాయి. రాజస్థాన్‌లోని రామ్‌గర్‌, జైసల్మేర్‌ ప్రాంతాల్లోని బీఎస్‌ఎఫ్‌ శిబిరాలపై జరిగిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా, జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో పౌరుల వాహనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.