
Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతూ, పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని సమాచారం.
పంజాబ్‌లోని అనేక కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు దిగుతున్నాయి.
అంతటితో ఆగకుండా, శ్రీనగర్‌లోని పాఠశాలలు, ఆసుపత్రుల వంటి పౌర ప్రాంతాలపై కూడా దాడులు చేయడం మానవత్వాన్ని మరిచిన చర్యగా భావించాల్సిన అవసరం ఉందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, పాక్ ఈ చర్యలు అత్యంత హేయంగా, నీచంగా కొనసాగిస్తోంది.
సైనిక స్థావరాలతో పాటు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారి దురుద్దేశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
Details
విద్యా సంస్థలు, ఆస్పత్రులపై దాడులు చేయడం అన్యాయం
పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపి భారత వైమానిక శక్తిని బలహీనపరచాలని పాకిస్తాన్ కుట్ర చేస్తోందన్నారు.
అదే విధంగా, శ్రీనగర్‌లోని విద్యా సంస్థలు, వైద్యాలయాలపై దాడులు జరపడం మానవత్వాన్ని పక్కనపెట్టి పిరికి చర్యలకు పాల్పడుతున్న వారి అసలైన స్వభావాన్ని వెల్లడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను టార్గెట్ చేస్తూ భారత్ రక్షణ వ్యవస్థపై దాడులకు దిగుతున్న పాక్, ఈ చర్యలతో ప్రాంతీయంగా తీవ్ర భయ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
అమాయక ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా వైమానిక దాడులు చేస్తోంది.
అయినప్పటికీ, భారత సైన్యం అప్రమత్తంగా ఉండి, శత్రువుల ప్రతి చర్యకు దీటుగా ఎదురుదెబ్బ ఇస్తోందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ స్పష్టం చేశారు.